IUML to dictate terms to Congress in Kerala
ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ – ఐయుఎంఎల్, కేరళలో
దేశ స్వాతంత్ర్యానికి ముందునుంచీ ఉన్న రాజకీయ పార్టీ. కేరళలోని యునైటెడ్
డెమొక్రటిక్ ఫ్రంట్ – యుడిఎఫ్‌లో కాంగ్రెస్‌తో పాటు ముస్లింలీగ్ కూడా భాగస్వామే.
కేరళలో యుడిఎఫ్, ఎల్డిఎఫ్లే ప్రధాన కూటములు కాగా ఈసారి బీజేపీ కూడా తన శక్తిని
పరీక్షించుకుంటోంది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బలమైన శక్తిగా
నిలుస్తుంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ దేశం మొత్తం మీద 52 సీట్లు మాత్రమే గెలుచుకుంటే
వాటిలో 15 సీట్లు కేరళలోనే గెలిచింది. అందువల్ల ఈ ఎన్నికల్లో కూడా కేరళలో పాగా
వేయడం కాంగ్రెస్‌కు జీవన్మరణ సమస్య.
రాహుల్ గాంధీ 2019లో అమేఠీతో పాటు వయనాడ్ నుంచి
కూడా పోటీ చేయడం ముస్లింలీగ్ అదృష్టాన్ని రెట్టింపు చేసింది. ఇప్పుడు 2024లో
వయనాడ్ తప్ప రాహుల్ గాంధీకి గత్యంతరం లేదని ముస్లింలీగ్‌కు అర్ధమైపోయింది. వయనాడ్ ముస్లింలీగ్
ప్రాబల్యం ఉన్న స్థానం. వయనాడ్ ఎంపీ సీటులోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటైన ఎరానంద్,
మలప్పురం జిల్లాలో ఉంది. 2009లో ఆ నియోజకవర్గం ఏర్పడినప్పటినుంచీ అది ముస్లింలీగ్
చేతిలోనే ఉంది.
రాహుల్‌గాంధీకి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ
చేయడానికి వయనాడ్ తప్ప మరో అవకాశమే లేదని ముస్లింలీగ్ అర్ధం చేసుకుంది. రాహుల్
నిస్సహాయత నుంచి లబ్ధి పొందడానికి ఆ పార్టీ నిర్ణయించుకుంది. ఇకపై తమ పార్టీ
పెట్టే డిమాండ్లను రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాల్సిందేనని
ముస్లింలీగ్ నిర్ణయానికి వచ్చింది. ఆ పార్టీ మొదట తమిళనాడులోని రామనాథపురం సీటును
తీసుకుంది.
రామనాథపురం లోక్‌సభ స్థానం నుంచి 2019లో ముస్లింలీగ్
పోటీ చేసి గెలిచింది. ఈసారి కూడా పోటీ చేసి, కాంగ్రెస్ మద్దతుతో గెలవాలని చూస్తోంది.
అంతేకాదు, రాహుల్ గాంధీని అడ్డుపెట్టుకుని తెలంగాణ వంటి దక్షిణాది రాష్ట్రాల్లో ముస్లిం
ప్రాబల్యమున్న ప్రాంతాల్లో కాలు మోపడానికి ప్రయత్నించవచ్చు.
అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి
కాంగ్రెస్ పార్టీ హాజరు కాకపోవడానికి కారణం ముస్లింలీగ్ సలహాయే అనే కథనం
ప్రచారంలో ఉంది. రాబోయే రోజుల్లో ముస్లింలీగ్ కాంగ్రెస్‌కు మరిన్ని షరతులు విధించే
అవకాశాలను త్రోసిపుచ్చలేము.
2021 కేరళ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 93 స్థానాల్లో
పోటీ చేసి 21 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ముస్లింలీగ్ 25 స్థానాల్లో పోటీచేసి 15 సీట్లు
గెలుచుకుంది. అంటే యుడిఎఫ్ కూటమిలో కాంగ్రెస్ కంటె ముస్లింలీగ్ మెరుగైన ప్రదర్శన
చేసింది. అందుకే 2026లో జరగబోయే కేరళ శాసనసభ ఎన్నికల్లో తమకు ఎక్కువ సీట్లు
కావాలని ముస్లింలీగ్ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు, ముఖ్యమంత్రి పదవి కూడా తమపార్టీకే
కావాలని ఒత్తిడి చేసే అవకాశమూ ఉంది.
కేరళలో 1982 నుంచీ ఒకసారి
యుడిఎఫ్ గెలిస్తే మరోసారి ఎల్డిఎఫ్ గెలవడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయం
2021లో దెబ్బతింది. కాంగ్రెస్ కారణంగా యుడిఎఫ్ వరుసగా రెండోసారి కూడా అధికారంలోకి
రాలేకపోయింది. అలాగే రాహుల్ గాంధీకి ఇప్పుడు యూపీలో సీటు లేదు. లోక్‌సభకు
వెళ్ళాలంటే ఆయనకు వయనాడే గతి. అలా కాంగ్రెస్ తమ కూటమిలోనే రెండోస్థాయికి
పతనమైపోయింది. ఆ కారణంగా 2026లో ముస్లింలీగ్, కాంగ్రెస్‌కు మరిన్ని షరతులు విధించే
అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.