ఒంటిమిట్ట
శ్రీ కోదండ రామాలయంలో
బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి.
నేడు స్వామివారు నవనీత కృష్ణాలంకారంలో దర్శనమిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఊరేగింపు నిర్వహించారు. స్వామివారికి సాయంత్రం ఊంజల్ సేవ, రాత్రికి
హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.
శుక్రవారం ఉదయం వటపత్రశాయి
అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి, రాత్రికి సింహ వాహనంపై సీతాపతిగా
విహరించారు.
పరాక్రమం, ధైర్యం, తేజస్సు, ఆధిపత్యం, మహాధ్వనికి
సింహాం సంకేతమని సనాతనులు విశ్వసిస్తారు. ఉదయం నిద్రలేవగానే దర్శించే వస్తువుల్లో
‘సింహదర్శనం’అతి ముఖ్యమైనదని, సింహ రూప దర్శనంతో సోమరితనం నశించి, పట్టుదలతో ప్రవర్తించి సర్వత్రా విజయాలతో ఆధిపత్యంతో
రాణించే స్ఫూర్తి సిద్ధిస్తుందని నమ్ముతారు.
సీతా రాముల కళ్యాణానికి
విచ్చేసే భక్తులకు తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అందజేసేందుకు టీటీడీ సిద్ధమైంది. తిరుమలలోని
శ్రీవారి సేవా సదన్ – 1లో 25 గ్రాముల లడ్డూల ను ప్యాక్ చేశారు. వీటిని ఒంటిమిట్టకు తరలించి
రాములవారి కళ్యాణం రోజు భక్తులకు అందజేస్తారు. 1.20 లక్షల లడ్డూలను 60 వేల జిప్‌లాక్ ప్యాకెట్లలో ప్యాక్ చేశారు.
ఏకశిలానగరం
ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీరామ నవమి
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 22న సాయంత్రం శ్రీ
సీతా రాముల కళ్యాణం జరగనుంది.