ఒడిశాలోని
ఝార్సుగూడ జిల్లాలో దారుణం జరిగింది. పడవ ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.
మహానదిలో సుమారు 50
మందితో ప్రయాణిస్తున్న ఓ పడవ బోల్తా పడింది. దీంతో ముగుర్గు ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. దీంతో ముగ్గురు పిల్లలు
సహా ఏడుగురు గల్లంతయ్యారు. వీరి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఓ మహిళ సహా నలుగురి మృతదేహాలు లభించాయి. మిగతా వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. సహాయ చర్యల్లో ఓడీఆర్ఏఎఫ్
బృందాలు పాల్గొన్నట్లు కలెక్టర్
కార్తికేయ గోయల్ చెప్పారు.
ప్రమాద ఘ టనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత
కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని
ప్రకటించారు. పడవ సామర్థ్యం కంటే ఎక్కువ మందిని ఎక్కించుకోవడంతోనే ప్రమాదం
జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.