ఆంధ్రప్రదేశ్
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు
తీసుకుంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయన్ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం
ఉత్తర్వులు జారీ చేసింది. సస్పెన్షన్ కాలంలో ప్రధాన కార్యాలయం విడిచి వెళ్లరాదని
ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది.
వెంకట్రామిరెడ్డి ప్రభుత్వోద్యోగిలా కాకుండా
వైసీపీకి అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఎన్నికల
కోడ్‌కు ముందు, కోడ్ సమయంలోనూ అధికార పార్టీకి
అనుకూలంగా ప్రచారం చేశారనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్ర సచివాలయంలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి విభాగంలో సహాయ
కార్యదర్శిగా పనిచేస్తున్న వెంకట్రామిరెడ్డి
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి పదవితో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల
సమాఖ్యకు ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు.
వైఎస్ఆర్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు
చల్లా చంద్రయ్య, మరికొందరితో కలిసి వైసీపీకి ఓట వేయాలని
బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో ప్రచారం చేసినట్ల
మీడియాలో వార్తలొచ్చాయి. దీనిపై ఎన్నికలకు సంఘానికి టీడీపీ ఫిర్యాదు చేసింది.