Rampachodavaram Assembly Constituency Profile
ఒకప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో భాగమైన
రంపచోడవరం, జిల్లాల పునర్విభజన తర్వాత అల్లూరి సీతారామరాజు జిల్లాలో భాగమయింది.
షెడ్యూల్డు తెగవారికి రిజర్వ్ అయిన ఈ నియోజకవర్గం ఇది. ఇందులో మారేడుమిల్లి,
దేవీపట్నం, వై రామవరం, అడ్డతీగల, గంగవరం, రంపచోడవరం, రాజవొమ్మంగి. కూనవరం,
చింతూరు, వరరామచంద్రాపురం, నెల్లిపాక అనే 11 మండలాలు ఉన్నాయి.
2008లో శాసనసభ నియోజకవర్గాల పునర్‌వ్యవస్థీకరణ
సమయంలో రంపచోడవరం ప్రత్యేకమైన నియోజకవర్గంగా ఏర్పాటయింది. అప్పటినుంచీ అక్కడ
మూడుసార్లు ఎన్నికలు జరిగాయి.
2009లో కాంగ్రెస్ అభ్యర్ధి కెకెవివివి సత్యనారాయణ
రెడ్డి గెలిచారు. 2014లో వైఎస్‌ఆర్‌సిపి అభ్యర్ధి వంతల రాజేశ్వరి, 2019లో వైఎస్‌ఆర్‌సిపి
అభ్యర్ధి నాగులాపల్లి ధనలక్ష్మి విజయం సాధించారు.
ఇప్పుడు 2024 ఎన్నికల్లో
అధికార వైఎస్ఆర్‌సిపి, సిట్టింగ్ ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మిని మరోసారి
బరిలోకి దింపుతోంది. ఎన్‌డిఎ కూటమి తరఫున తెలుగుదేశం అభ్యర్ధి పుంతల రాజేశ్వరి
పోటీ పడుతున్నారు. ఇండీ కూటమి తరఫున సిపిఎం అభ్యర్ధి లోతా రామారావు రంగంలో ఉన్నారు.