ఏపీలో రెండో రోజూ నామినేషన్ల జోరు కొనసాగింది. ఉదయం నుంచే పలువురు ప్రముఖులు నామినేషన్లు వేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల కోలాహలం కొనసాగింది. రాజమహేంద్రవరంలో కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ నుంచి నామినేషన్ వేశారు.
చిత్తూరు జిల్లా కుప్పుంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు.తాడేపల్లిగూడెం నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ జనసేన అభ్యర్థి నామినేషన్ వేశారు. కొండపి టీడీపీ అభ్యర్థి డోలా బాలవీరాంజనేయస్వామి, యర్రగొండపాలెం టీడీపీ అభ్యర్థి గూడూరు ఎరిక్సన్, కావలి టీడీపీ అభ్యర్థిగా కావ్య కృష్ణారెడ్డి నామినేషన్లు వేశారు.
విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినాని చిన్ని, విజయవాడ తూర్పు అసెంబ్లీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ తరపున ఆయన సతీమణి అనూరాధ నామినేషన్ దాఖలు చేశారు. తాడికొండ టీడీపీ అభ్యర్థిగా తెనాలి శ్రావణ్ కుమార్, మంగళగిరి వైసీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య, పాలకొల్లు టీడీపీ అభ్యర్థిగా నిమ్మల రామానాయుడు నామినేషన్లు వేశారు. హిందూపురం టీడీపీ అసెంబ్లి అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేశారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్