సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్
యాదవ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల మధ్య ఎన్నికల మైత్రిపై ప్రధాని మోదీ సెటైర్లు వేశారు. ‘ఇద్దరు
యువరాజులు నటించిన చిత్రాన్ని’ ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరస్కరించినా, మళ్ళీ ప్రజలకు
ముదుకు వస్తున్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన
మోదీ, ప్రతిపక్షాలపై తీవ్ర విమర్వలు
చేశారు. అవినీతి,
బంధుప్రీతి, బుజ్జగింపుల పేరిట ఓట్లు అడిగేందుకు ఇండీ కూటమి
సిద్ధమైందని చురకలు అంటించారు.
ప్రజల విశ్వాసంపై దాడి చేస్తుందని ఇండీ
కూటమిని దుయ్యబట్టారు. అయోధ్యలోని రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకలకు ఆహ్వానాన్ని
సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ తిరస్కరించిన విషయాన్ని
ప్రధానిమోదీ గుర్తుచేశారు.
పొత్తులో భాగంగా ఉత్తరప్రదేశ్ లో సమాజ్‌వాదీ పార్టీ 63 స్థానాల్లో, కాంగ్రెస్ 17 చోట్ల
పోటీ చేస్తున్నాయి. 2017 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎస్పీ మధ్య
పొత్తు ఉన్నప్పటికీ బీజేపీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంది.