రాష్ట్రంలో
ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాడ్పులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి.
రాష్ట్రంలో
సగానికి పైగా జిల్లాల్లో గురువారం వడగాడ్పులు, తీవ్ర
వడగాడ్పులు వీచాయి. దీంతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడ్డారు.
రానున్న
రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు
మరింత తీవ్రమవుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ద్రోణి ప్రభావంతో కొన్ని చోట్ల
తేలికపాటి నుంచి వర్షాలు కురవనున్నాయి.
అల్లూరి
సీతారామరాజు జిల్లా ఎర్రంపేట, పార్వతీపురం
మన్యం జిల్లా కొమరాడలో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు
అయింది. నంద్యాలలో 45.6 డిగ్రీలు, విజయనగరంలో 45.5 డిగ్రీలు, ప్రకాశంలో 45.3 డిగ్రీల
ఉష్ణోగ్రతలు
నమోదు అయ్యాయి.
శనివారం
39 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 215 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశముందని
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ
పేర్కొంది.
గల్ఫ్
ఆఫ్ మన్నార్ నుంచి దక్షిణ తెలంగాణ వరకు వ్యాపించి ఉన్న ద్రోణి గురువారం కొమరిన్
ప్రాంతం నుంచి దక్షిణ తెలంగాణ, అంతర్గత
తమిళనాడు, రాయలసీమ మీదుగా కొనసాగుతోంది. దీంతో
నేడు, రేపు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి
నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.