వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలైపోయింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలోని బూదిదపల్లె శివారు అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.శుక్రవారం తెల్లవారుజామున ఘటన జరిగినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లా అటవీశాఖ అధికారుల కథనం ప్రకారం.
అడవి జంతువులే లక్ష్యంగా వేటగాళ్లు ఉచ్చులు ఏర్పాటు చేశారు. బూడిదపల్లె గ్రామానికి చెందిన లక్ష్మయ్య పంట పొలం సమీపంలో విద్యుత్ ఉచ్చులు ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతం నుంచి పొలాలకు వచ్చిన ఏనుగుల మందలో ఓ ఏనుగు విద్యుత్ తీగకు బలైంది. మరికొన్ని ఏనుగులు తప్పించుకున్నాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అయిదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు