ఇజ్రాయెల్‌పై గత వారం ఇరాన్ దాడులకు దిగిన తరవాత పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా ప్రతీకార దాడులకు దిగవచ్చని అందరూ అనుమానించారు. అనుకున్న విధంగానే శుక్రవారం రాత్రి ఇరాన్లో భారీ పేలుళ్లు సంభవించాయి. ఇది ఇజ్రాయెల్ పనిగా అనుమానిస్తున్నారు. ఇరాన్‌తో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆ దేశ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించిన రోజుల వ్యవధిలోనే ఇజ్రాయెల్ దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది.
ఇరాన్‌లోని అణు కేంద్రం ఉన్న ఇస్ఫహాన్ పట్టణంలో శుక్రవారం భారీ పేలుళ్లు జరిగాయని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఇరాన్ ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ముందు జాగ్రత్తలు తీసుకుంది. గగనతలాన్ని మూసివేసింది. విమానాలను దారి మళ్లించారు. ఇస్ఫహాన్ నగరంలో అణుకేంద్రం, సైనిక శిబిరాలున్నాయి.
ఎలాంటి దాడులైనే ఎదుర్కొనేందుకు ఇరాన్ సిద్దమైంది. దేశ గగనతల రక్షణ వ్యవస్థను సిద్దం చేసింది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. అనుమానిత డ్రోన్లనుకూల్చివేయాలని సైనాన్ని ఆదేశించింది.