Palakonda Assembly Constituency Profile
మొదట్లో శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పాలకొండ
నియోజకవర్గం ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత పార్వతీపురం మన్యం
జిల్లాలోకి వచ్చింది. 1951లో ఏర్పడిన ఈ నియోజకవర్గంలో 1952 నుంచీ ఎన్నికలు
జరుగుతున్నాయి. షెడ్యూల్డు తెగలకు రిజర్వు చేసిన ఈ నియోజకవర్గం పరిధిలో పాలకొండ,
సీతంపేట, వీరఘట్టం, భామిని అనే నాలుగు మండలాలు ఉన్నాయి.
పాలకొండ అసెంబ్లీ స్థానంలో ఏ పార్టీ కూడా వరుసగా
రెండుసార్లు గెలవలేదు. ఆ పరిస్థితి 2009 వరకూ కొనసాగి, ఆ తర్వాత మారింది. 2014లో వైఎస్ఆర్‌సిపి
తరఫున గెలిచిన విశ్వాసరాయ కళావతి 2019లో కూడా విజయం సాధించింది. ఇప్పుడు
హ్యాట్రిక్ కొట్టడానికి ప్రయత్నిస్తోంది.
ఎన్‌డిఎ కూటమి తరఫున
నిమ్మక జయకృష్ణ జనసేన పార్టీ అభ్యర్ధిగా రంగంలో ఉన్నారు. జయకృష్ణ 2014లోనూ,
2019లోనూ తెలుగుదేశం అభ్యర్ధిగా పోటీ చేసి రెండుసార్లూ ఓడిపోయారు. ఈసారి
టిడిపి-జెఎస్‌పి-బిజెపి కూటమిగా ఏర్పడినందున పాలకొండ సీటు పొత్తులో జనసేనకు
దక్కింది. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన నిమ్మక జయకృష్ణ పార్టీ జెండా మార్చి
జనసేనలో చేరి అక్కడినుంచి టికెట్ దక్కించుకున్నారు. మరోవైపు, ఇండీ కూటమి తరఫున కాంగ్రెస్
అభ్యర్ధిగా సరవ చంటిబాబు బరిలో నిలిచారు.