ఆంధ్రప్రదేశ్
లో నామినేషన్ల సందడి మొదలైంది. భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని
నామినేషన్ పత్రాలను సమర్పించారు.
ఒంగోలు
లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు
నాగరాజు (టీడీపీ) నామినేషన్ వేశారు. కేంద్ర మాజీమంత్రి సుజనా చౌదరి విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి బీజేపీ తరఫున
నామినేషన్ దాఖలు చేశారు.
కర్నూలు
జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి , వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక , శ్రీశైలం వైసీపీ అభ్యర్థిగా శిల్పా చక్రపాణిరెడ్డి
నామినేషన్ వేశారు.
నెల్లూరు
జిల్లా కోవూరు తాలూకా ఆఫీసు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కోవూరు అసెంబ్లీ
స్థానానికి వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి
ప్రసన్నకుమార్ రెడ్డి నామినేషన్ వేశారు. ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి
ప్రశాంతిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇరు పార్టీల అభ్యర్థులు ఒకే సమయంలో స్వల్ప ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను
చెదరగొట్టారు.
వెంకటగిరి వైసీపీ అభ్యర్థిగా ఉన్న నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
తరఫున ఆయన తల్లి నేదురుమల్లి రాజ్యలక్ష్మి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్
అధికారికి అందజేశారు.
ఎన్టీఆర్
జిల్లా గన్నవరం టీడీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు నామినేషన్ పత్రాలను
ఆర్వోకి సమర్పించారు.
టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ మంగళగిరి అసెంబ్లీ
అభ్యర్థి నారా లోకేశ్ తరఫున ఎన్డీయే కూటమి నేతలు నేడు నామినేషన్ దాఖలు చేశారు.
నారా
లోకేశ్ నామినేషన్ దాఖలుకు శ్రీరంగనాథ స్వామి ఆలయ పూజారులు ముహూర్తం ఖరారు
చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
పల్నాడు
జిల్లా నరసరావుపేట పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు
నేడు నామినేషన్ వేశారు.
రామచంద్రపురం
ఆర్డీఒ కార్యాలయంలో వైసీపీ అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్, రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయగా, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఒక సెట్
నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారి కి అందజేశారు.
సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో హిందూపురం
పార్లమెంటుకు వైసీపీ అభ్యర్థి బోయ శాంత
తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. రాజంపేటంలో వైసీపీ
అభ్యర్థి అకేపాటి అమరనాథరెడ్డి,
తిరువూరు
వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్, కొవ్వూరులో
ఆర్డిఓ ఆఫీస్ వద్ద 10 వేలమంది పార్టీ
కార్యకర్తలు అభిమానులతో వైసీపీ ఎమ్మెల్యే
అభ్యర్థి తలారి వెంకట్రావు నామినేషన్ దాఖలు చేశారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్