వేసవిలో తాగునీటి
అవసరాల కోసం కృష్ణానది యాజమాన్య బోర్డు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 12న జరిగిన త్రిసభ్య కమిటీ
సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసింది.
నీటి ఎద్దడి దృష్ట్యా నాగార్జునసాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని
వినియోగించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. 500 అడుగుల వరకు సాగర్‌లో 14.195 టీఎంసీల వరకు నీటి లభ్యత
ఉంది.
ఏపీకి 5.5
టీఎంసీలు కేటాయించగా మిగిలిన నీటిని హైదరాబాద్ సహా ఇతర జిల్లాల తాగునీటి అవసరాల
కోసం వినియోగానికి తెలంగాణకు అనుమతి ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పూర్తిగా
తాగునీటి అవసరాల కోసమే నీటిని వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో కేఆర్ఎంబీ స్పష్టం చేసింది.