విజయవాడ
ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో రేపటి నుంచి చైత్ర
మాస బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 19 నుంచి 27
వరకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల
చైత్రమాస బ్రహ్మోత్సవాలు జరగనున్నట్లు ఈవో కేఎస్ రామారావు తెలిపారు. 22న
రాత్రి 10.30 నిముషాలకు శ్రీ దుర్గా మల్లేశ్వర దివ్య కళ్యాణమహోత్సవాన్ని
నిర్వహించనున్నారు. 24న
ఉదయం 10 గంటలకు పూర్ణాహుతి, సాయంత్రం శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ
మల్లేశ్వర స్వామి వార్లకు పవిత్ర కృష్ణానదిలో తెప్పోత్సవం జరగనుంది.
ఇంద్రకీలాద్రిపై
వసంత నవరాత్రి ఉత్సవాలు నేటితో ముగిసాయి. చివరరోజు ప్రత్యేక పుష్పాలతో
శ్రీదుర్గమ్మకు అర్చన చేశారు. చివరి
రోజులో భాగంగా పూర్ణహుతి కార్యక్రమం నిర్వహించారు.
యాగశాలలో
ఆలయ స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ గారు, వైదిక కమిటీ సిబ్బందిచే శాస్త్రోక్తంగా పూర్ణాహుతి కార్యక్రమం
నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో దంపతులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..
శ్రీరామ
పట్టాభిషేక మహోత్సవాన్ని ధర్మపదం వేదిక నందు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్ రామరావు పాల్గొన్నారు.