Wednesday, July 9, 2025
No Result
View All Result
Andhra Today

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
Andhra Today
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
    • ప్రత్యేక నవీకరణలు
    • రషీఫాల్
    • వినోదం
    • వ్యాపారం
    • చట్టపరమైన
    • చరిత్ర
    • వైరల్ వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
No Result
View All Result
Andhra Today
No Result
View All Result

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
  • జీవనశైలి
Home రాజకీయం

దేవభూమిలో కాషాయజెండా మళ్ళీ రెపరెపలాడుతుందా?

param by param
May 12, 2024, 09:54 pm GMT+0530
FacebookTwitterWhatsAppTelegram

Will Saffron Flag be able to hold Devbhoomi Uttarakhand?

లోక్‌సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్‌లో అన్ని
స్థానాలకూ ఎన్నికలు జరుగుతున్న మరో రాష్ట్రం ఉత్తరాఖండ్. దేవభూమిగా వ్యవహరించే ఆ
రాష్ట్రంలో ఐదు లోక్‌సభ స్థానాలు ఉంటే, వాటన్నింటికీ రేపు శుక్రవారం పోలింగ్
జరగనుంది.

ఉత్తరాఖండ్‌లో ఐదు ఎంపీ సీట్లున్నాయి. తెహ్రీ
గఢ్వాల్, గఢ్వాల్, అల్మోరా, నైనిటాల్-ఉధంసింగ్‌నగర్, హరిద్వార్. 2019 లోక్‌సభ ఎన్నికల్లో
ఆ ఐదు స్థానాలనూ భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకోగలిగింది. అప్పుడు 61.5శాతం
పోలింగ్ జరిగింది.

ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో
ఉండడం ఆ పార్టీకి సానుకూలాంశం. అంతేకాదు, గత నెలలో ఉత్తరాఖండ్ శాసనసభ యూనిఫామ్
సివిల్ కోడ్‌ను అమల్లోకి తీసుకొస్తూ చట్టం చేసింది. దాని ప్రభావం ప్రజల్లో ఎలా
ఉందన్న విషయం ఇప్పుడు జరిగే లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌లో తేలిపోతుంది. అందువల్లే ఈ
రాష్ట్రంలో ఎంపీ ఎన్నికలను ప్రత్యేక దృష్టితో చూస్తున్నారు.

ఉత్తరాఖండ్‌లో ప్రధానమైన నియోజకవర్గాల్లో మొదట
చెప్పుకోదగినది హరిద్వార్. రాష్ట్ర మాజీముఖ్యమంత్రి హరీష్ రావత్ ఈ ప్రాంతానికి
చెందినవారు. 2014 నుంచీ ఇక్కడ బీజేపీ కాషాయజెండా ఎగురుతోంది. హరిద్వార్ నియోజకవర్గం
1977 నుంచి 2009 వరకూ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా ఉండేది. 2014లో ఈ
నియోజకవర్గంలో బీజేపీ మాజీ ముఖ్యమంత్రి రమేష్ పోఖ్రియాల్ ఎంపీగా గెలిచారు. 2019లో
కూడా ఆయనే కాంగ్రెస్ అభ్యర్ధి అంబరీష్ కుమార్‌ను రెండున్నర లక్షలకు పైగా
మెజారిటీతో ఓడించారు. ఇప్పుడు 2024 ఎంపీ ఎన్నికలకు బీజేపీ తమ అభ్యర్ధిగా మాజీ
ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్‌ను మోహరించింది. కాంగ్రెస్ అభ్యర్ధిగా మాజీ
సీఎం హరీష్ రావత్ కుమారుడు వీరేంద్ర రావత్ బరిలో ఉన్నారు.

గఢ్వాల్ నియోజకవర్గం ప్రత్యేకత ఏంటంటే అందులో ఐదు
జిల్లాల ప్రాంతాలున్నాయి. చమోలీ, పౌరీగఢ్వాల్, రుద్రప్రయాగ జిల్లాలు పూర్తిగానూ,
నైనిటాల్, తెహ్రీ గఢ్వాల్ జిల్లాల్లో కొన్నిభాగాలూ ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి.
2014 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి అభ్యర్ధి భువనచంద్ర ఖండూరీ విజయం సాధించారు. 2019
ఎన్నికల్లో బిజెపి తరఫున తీరథ్ సింగ్ రావత్ పోటీచేసి గెలుపొందారు. ఇప్పుడు 2024లో
ఆ పార్టీ తరఫున అనిల్ బలూనీ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధి గణేష్ గోడియాల్‌తో
తలపడుతున్నారు.

ఉత్తరాఖండ్‌లో మరో ముఖ్యమైన ఎంపీ సీటు అల్మోరా.
2009నుంచీ ఆ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేసారు. అల్మోరా నియోజకవర్గం పరిధిలో
బాగేశ్వర్, చంపావత్, అల్మోరా, పితోరాగఢ్ అనే నాలుగు జిల్లాలున్నాయి. ఈ స్థానం
1952లో ఏర్పడినప్పటినుంచీ కాంగ్రెస్ కంచుకోటగా ఉండేది. కానీ 1996లో బీజేపీ ఈ
స్థానాన్ని కాంగ్రెస్ నుంచి లాగేసుకుంది. అప్పటినుంచి ఇప్పటివరకూ, ఒక్క 2009లో
తప్ప, అన్నిసార్లూ బీజేపీయే విజయం సాధించింది. 2014, 2019 ఎన్నికల్లో బిజెపి తరఫున
అజయ్ తమటా విజయం సాధించారు. ఇప్పుడాయన మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందుకు
ప్రయత్నిస్తున్నారు. గత రెండుసార్లూ అజయ్ చేతిలో ఓడిపోయిన ప్రదీప్ తమటాయే మూడోసారి
కూడా కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలబడుతున్నారు.

2024 లోక్‌సభ ఎన్నికల గురించి ఇప్పటివరకూ నిర్వహించిన
ప్రీపోల్ సర్వేలన్నీ ఉత్తరాఖండ్‌లోని 5 నియోజక వర్గాలనూ బీజేపీ స్వీప్ చేస్తుందని
అంచనా వేస్తున్నాయి. అయితే ఆ పరిస్థితిని మార్చడానికి కాంగ్రెస్ శ్రమిస్తోంది.

Tags: BJPCongressLok Sabha ElectionsUCCUttarakhand
ShareTweetSendShare

Related News

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు
general

అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రత్యేకతలు – విశాఖలో భారీ ఏర్పాట్లు

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన
general

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు
general

కన్నడ ముద్దు, హిందీ వద్దు… ఉర్దూపై నోరు మెదపొద్దు

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం
general

క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5
general

ది హిందూ: భారత వ్యతిరేక, హిందూ వ్యతిరేక, చైనా బాకా – 5

Latest News

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏపీ దశదిశను మార్చనుందా?

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

మొహర్రం సందర్భంగా హిందువులపై ముస్లిముల హింస, దేవాలయాల్లో పీర్లు

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

ఇప్పటి బీజేపీ కి మూలకర్త శ్యామా ప్రసాద్ ముఖర్జీ

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

యువతకు నిరంతర స్ఫూర్తి దాత.. అల్లూరి

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

చిత్ర పరిశ్రమకూ తప్పని ఎమర్జెన్సీ పోటు

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

అమరావతి రాజధానికి మలివిడత భూసమీకరణ

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

విద్యార్ధులకు స్ఫూర్తిదాయకంగా ఆపరేషన్ సిందూర్ విజయ యాత్ర

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

మతాలు వేరైనా ధర్మం ఒక్కటే… అదే ఆర్ఎస్ఎస్ అభిమతం

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

హిందుత్వ అస్తిత్వాన్ని జాగృతం చేసే సంఘ శాఖ

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

యోగా చేసే ముస్లిములపై అతివాదుల దాష్టీకాలు

  • Home
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions
  • Disclaimer
  • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.

No Result
View All Result
  • జాతీయ
  • రాష్ట్రం
  • అంతర్జాతీయం
  • వీడియోలు
  • రాజకీయం
  • వ్యాపారం
  • వినోదం
  • క్రీడలు
  • Opinion
    • జీవనశైలి
  • About & Policies
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms & Conditions
    • Disclaimer
    • Sitemap

Copyright © Andhra-Today, 2024 - All Rights Reserved.