ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా మద్దతు ఉంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ
డిప్యూటీ అధికారి వేదాంత్ పటేల్ తెలిపారు.
ఐక్యరాజ్య సమితి, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమని,
భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం లేకపోవడాన్ని టెస్లా అధినేత ఎలాన్ మస్క్
ఇటీవల ప్రస్తావించారు. దీనిపై రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు వేదాంత్ పటేల్ వివరణ
ఇచ్చారు.
ఇప్పటికే ఐక్యరాజ్యసమితి జనరల్
అసెంబ్లీ అమెరికా అధ్యక్షడు ఈ విషయంపై స్పందించారని, ఐరాస కార్యదర్శి సైతం ఈ
విషయాన్ని ప్రస్తావించిన విషయాన్నివేదాంత్ గుర్తు చేశారు. 21 శతాబ్దాన్ని ప్రతిబింబించేలా ఐరాసతో పాటు దాని అనుబంధ సంస్థల్లో తప్పకుండా మార్పులు
అవసరం అన్నారు. ఐరాస సంస్కరణలకు అమెరికా కచ్చితంగా మద్దతు తెలుపుతుందన్నారు.
ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమని జనవరి
లో ఎక్స్ వేదికగా టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రస్తావించారు. భద్రతా మండలిలో భారత్
వంటి దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం సరికాదన్నారు. శక్తివంతమైన దేశాలు తమ
సభ్యత్వాన్ని వదులుకోలేక పోతున్నాయంటూ విమర్శించారు.
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన
దేశాల్లో ఒకటైన భారత్కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదమన్నారు.
ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా 1945లో ఐక్యరాజ్యసమితి ఏర్పడింది. ఐరాసకు అనుబంధంగా
భద్రతా మండలి ఏర్పడగా అప్పటి నుంచి ఎలాంటి మార్పులు జరగలేదు. శాశ్వత సభ్యదేశాలుగా
అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్
ఉన్నాయి.
శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చాలా
ఏళ్ళుగా ప్రయత్నాలు చేస్తోంది. చైనా అడ్దుకోవడంతోనే మనకు చోటు దక్కడం లేదు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు