ఏకశిలానగరం
ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా కొనసాగుతున్నాయి. శ్రీ కోదండరాముడి
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారు వేణుగానాలంకారంలో దర్శనమిచ్చి భక్తులను
అనుగ్రహించారు. ఆలయ మాడ వీధుల్లో విహరించారు.
ఉదయం 7.30 గంటలకు స్వామి ఊరేగింపు ప్రారంభమైంది. భక్తులు
పాటలు పాడుతూ కోలాటం ఆడుతూ, చెక్కభజన చేస్తూ కీర్తనలు ఆలపించారు. ఉదయం 11
గంటలకు ఆలయంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. నేయి, పాలు,
పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవార్లకు
అభిషేకం చేశారు. రాత్రి 7 గంటలకు
స్వామివారు హంసవాహనంపై విహరించనున్నారు. బుధవారం రాత్రి శేషవాహనంపై సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిగా
దర్శనమిచ్చారు.
ఏప్రిల్ 20న హనుమంత వాహన సేవ నిర్వహిస్తుండగా, ఏప్రిల్
22న కళ్యాణోత్సవం, 23న రథోత్సవం, 25న చక్రస్నానం నిర్వహించనున్నారు.
కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో నటేష్ బాబు, సూపరింటెండెంట్
హనుమంతయ్య, టెంపుల్
ఇన్స్పెక్టర్ నవీన్ పాల్గొన్నారు.