BJP leader killed in Bastar of Chattisgarh
నిషిద్ధ సిపిఐ
మావోయిస్టు సంస్థకు చెందిన 29మంది మావోయిస్టులను భద్రతా బలగాలు కాంకేర్‌లో హతమార్చిన
కొన్ని గంటలకే, మావోయిస్టులు మళ్ళీ రెచ్చిపోయారు. నిరాయుధులైన సాధారణ పౌరులపై తమ
హింసాత్మక ప్రవృత్తితో విరుచుకుపడ్డారు.
ఛత్తీస్‌గఢ్‌లోని
నారాయణపూర్ జిల్లా దాండ్వాన్ గ్రామం ఉపసర్పంచ్, స్థానిక బిజెపి నాయకుడు పంచమ్ దాస్‌ను
మంగళవారం దాదాపు అర్ధరాత్రి వేళ మావోయిస్టులు తుదముట్టించారు.
మావోయిస్టులు
పంచమ్ దాస్ ఇంట్లోకి చొరబడి, అతన్ని బలవంతంగా ఎత్తుకుపోయారు. ఒక నిర్జన
ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ కాల్చి చంపారు. ఆ తర్వాత మృతదేహాన్ని గ్రామం
శివారుల్లో విసిరేసి అక్కడినుంచి పారిపోయారు.
పంచమ్దాస్
హత్యకు బాధ్యత తమదేనంటూ నిషిద్ధ సిపిఐ మావోయిస్టు సంస్థకు చెందిన తూర్పు బస్తర్
డివిజన్ కమిటీ ప్రకటించింది. దాస్ పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తున్నాడని,
అందుకే అతన్ని చంపేసామనీ ఆ ప్రాంతం అంతటా పోస్టర్లు అంటించారు. ఇంకా, ఆ పోస్టర్లలో
బిజెపి, ఆర్ఎస్ఎస్లను దెబ్బతీయాలని పిలుపునిచ్చారు.
పంచమ్దాస్ హత్య విషయం తెలిసిన వెంటనే ఒక పోలీసు బృందం సంఘటనా స్థలానికి
చేరుకుంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంది. తర్వాత దాన్ని శవపరీక్ష కోసం
పంపించింది. ఇక పారిపోయిన మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి.
బస్తర్‌లో మావోయిస్టుల
ప్రాబల్యం గణనీయంగా ఉంది. దాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు
చేస్తోంది.