మన పాలపుంతలో అతిపెద్ద కృష్ణ బిలాన్ని
ఖగోళ శాస్ర్తవేత్తలు తాజాగా గుర్తించారు. ఈ కృష్ణ బిలం ద్రవ్య రాశి సూర్యుడికన్నా
ఏకంగా 33 రెట్లు పెద్దది కాగా దీనికి గయా బీహెచ్3 గా పేరు పెట్టారు. భూమికి 2,000 కాంతి సంవత్సరాల దూరంలో గరుడ
నక్షత్ర మండలంలో ఉన్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు.
యూరోపియన్
స్పేస్ ఏజెన్సీ చేపట్టిన గయా మిషన్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తుండగా
బ్లాక్ హోల్ ను గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ ఖగోళ
పరిశోధకుడు పాస్కల్ పనుజ్జో తెలిపారు.
పాలపుంతలో ఎక్కడెక్కడ ఎలాంటి
నక్షత్రాలు ఉన్నయో గుర్తించే ప్రాజెక్టే గయా మిషన్.
పాలపుంతలో ఇప్పటికే రెండు
నిష్క్రియా కృష్ణ బిలాలను (గయా బీహెచ్1, గయా బీహెచ్2) గయా టెలిస్కోప్ గుర్తించింది. ఈ
టెలిస్కోప్ పదేళ్ళుగా భూమికి, సూర్యుడికి మధ్య 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాగ్రేంజ్
పాయింట్ 2 నుంచి పనిచేస్తోంది.