అకాల వర్షంతో దుబాయ్ వాసులు అల్లాడుతున్నారు. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర
అంతరాయం ఏర్పడింది. దుబాయ్ విమానాశ్రయంలో విమాన
సర్వీసులకు ఆటంకం ఏర్పడింది.
షాపింగ్ మాల్స్‌లో మోకాలిలోతు వరకూ నీరు చేరింది. వరద ధాటికి రోడ్లు కొట్టుకుపోయాయి. నివాసాల్లోకి నీరు
చేరింది.
వర్షం ప్రభావం దుబాయ్‌తో పాటూ
యూఏఈ, పొరుగున ఉన్న బహ్రెయిన్ పై కూడా పడింది. దీంతో
పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఒమన్‌లో
వర్షం బీభత్సానికి చిన్నారులు సహా మొత్తం
18 మంది చనిపోయారు.
దుబాయ్ లో ఏడాదిన్నరలో నమోదవ్వాల్సిన కొన్ని
గంటల్లోనే కురిసింది. 142 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు
ప్రకటించారు. వాతావారణ మార్పుల ప్రభావంతోనే
అకాల వానలు పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు