ఉజ్జయినిలో కొలువైన మహాకాళేశ్వరుడు, శ్రీరాముడి రూపంలో
దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు మహాకాళేశ్వరుడికి
భస్మహారతి నిర్వహించారు. గర్భగుడిలోని స్వామివారికి పంచామృతాలతో అభిషేకం
నిర్వహించి పూజలు నిర్వహించారు.
హారతి కార్యక్రమం అనంతరం మహాకాళేశ్వరుడికి
వెండి కిరీటం,
రుద్రాక్ష మాల ధరింపజేశారు. భస్మ హారతి
సమయంలో మహాకాళేశ్వరుణ్ణి శ్రీరాముడిగా అలంకరించారు. స్వామి నామస్మరణతోఆలయ పరిసరాలు మార్మోగాయి.