భద్రాచలం రామాలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. మిథిలా మైదానంలో శ్రీసీతారాముల వారి కల్యాణోత్సవాలను వేదపండితులు వైభవంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
శ్రీసీతారాములోరి కల్యాణం తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. భద్రాచలం పురవీధులు రామనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. పలువురు ప్రముఖులు కల్యాణోత్సవాల్లో పాల్గొన్నారు.