ఉగ్రవాదాన్ని ఉపేక్షించేది లేదని, వారు ఎక్కడున్నా, కలుగుల్లోంచి బయటకులాగి మట్టుబెడతామని ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. భారత్, పాక్ మధ్య నెలకొన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా సలహా ఇచ్చింది. దాడులకు పాల్పడి పాక్ పారిపోయి దాక్కున్నా ఉగ్రవాదులను అక్కడికెళ్లి మరీ మట్టుబెడతామని ప్రధాని మోదీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అగ్రరాజ్యం స్పందించింది.
భారత్,పాక్ మధ్య మేం జోక్యం చేసుకోవడం లేదు, కానీ ఇరు దేశాలు చర్చల ద్వారా ఓ పరిష్కారం కనుగొనాలని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సూచించారు. పాకిస్థాన్‌లో ఇటీవల అనేక మంది ఉగ్రవాదులు అనుమానాస్పదంగా హతం కావడం వెనుక భారత్ హస్తముందంటూ బ్రిటన్‌కు చెందిన గార్డియన్ పత్రికలో కథనాలు వచ్చాయి. 2019 పుల్వామా ఘటన అనంతరం ఉగ్రవాదులను భారత్ లక్ష్యంగా చేసుకుందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. భారత్ రా సంస్థ ద్వారా 20 హత్యలు చేయించిందని కథనాల సారాంశం. అవన్నీ తప్పుడు కథనాలని ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఖండించిన సంగతి తెలిసిందే. అయితే భారత్‌లో దాడులకు తెగబడిన వారిని ఎక్కడున్నా బయటకులాగి మట్టుబెడగామని వారు హెచ్చరించారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు