సివిల్స్ 2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. అఖిల భారత సర్వీసుల కోసం యూపీఎస్సీ ప్రతి ఏటా ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. 2023 ఫలితాల్లో తెలుగు యువతి
అనన్య రెడ్డి మూడో ర్యాంకు సాధించింది. 2023 ఏడాదికి మొత్తం 1016 మందిని ఎంపిక చేశారు. జనరల్ కోటాలో 347, ఈడబ్ల్యూఎస్ 115, ఓబీసీ 303, ఎస్సీ 165, ఎస్టీ విభాగంలో 86 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
2023 బ్యాచ్లో ఆదిత్య శ్రీవాస్తవ మొదటి ర్యాంకు, అనిమేష్ ప్రథాన్ రెండో ర్యాంకు సాధించారు.సెంట్రల్ సర్వీసెస్ గ్రూప్ ఎ కేటగిరిలో 613 మంది గ్రూప్ బిలో 113 మంది ఎంపికయ్యారు. గత ఏడాది మే 28న ప్రిలిమ్స్, సెప్టెంబరు 15 నుంచి మెయిన్స్ నిర్వహించారు. జనవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. తుది ఫలితాలు ఇవాళ విడుదల చేశారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు