లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే ఏడుగురు
అభ్యర్థులతో బీజేపీ 12వ జాబితాను విడుదల చేసింది. తాజా జాబితాలో నాలుగు రాష్ట్రాల
పరిధిలో ఏడు స్థానాలకు అభ్యర్థులను భారతీయ జనతాపార్టీ ప్రకటించింది.
మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల
పరిధిలోని కీలక స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్లోని కీలకమైన
డైమండ్ హార్బర్ లోక్సభ స్థానం నుంచి అభిజిత్ దాస్, కమలం గుర్తుపై పోటీ
చేయనున్నారు. ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా టీఎంసీ తరఫున సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పోటీలో
ఉన్నారు.
ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్
నుంచి ఠాకూర్ విశ్వజిత్ సింగ్, డియోరియా స్థానం నుంచి శశాంక్ మణి త్రిపాఠి పోటీ లో
ఉండనున్నారు.
మహారాష్ట్రలోని సతారా లోక్సభ
స్థానం నుంచి ఛత్రపతి ఉదయన్ రాజే భోంస్లే ఎన్నికల బరిలో నిలవనుండగా పంజాబ్ రాష్ట్రంలోని ఖదూర్ సాహిబ్ లోక్సభ
స్థానం నుంచి మంజీత్ సింగ్ మన్నా మియావింద్, హోషియార్పూర్ నుంచి అనితా సోమ్
ప్రకాష్, భటిండా నుంచి పరంపల్ కౌర్ సింధు
అభ్యర్థిత్వాలను బీజేపీ ఖరారు చేసింది.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్