దేశంలో ఉల్లి ధరలు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఎగుమతులు నిషేధించిన సంగతి తెలిసిందే. అయితే కేంద్రం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, శ్రీలంక దేశాలకు పరిమతికి లోబడి ఉల్లి ఎగుమతి చేసేందుకు అనుమతించింది. శ్రీలంకకు పది వేల టన్నులు, యూఏఈకి పదివేల టన్నులు ఉల్లి ఎగుమతి చేసేందుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ, డీజీఎఫ్‌టీ అనుమతిస్తూ సోమవారం రాత్రి నిర్ణయం తీసుకున్నాయి. ఈ రెండు దేశాలకు ఎన్‌సీఈఎల్ ద్వారా ఉల్లి ఎగుమతి చేయనున్నారు.
గత ఏడాది డిసెంబరు కేంద్ర ప్రభుత్వం ఉల్లి ఎగుమతులను మార్చి 2024 వరకు నిషేధించింది. ఆ తరవాత మరోసారి పొడిగించారు. పలు దేశాల నుంచి ఉల్లి కోసం వస్తున్న వినతులను పరిశీలించి కేంద్రం నిర్ణయం తీసుకుంటోంది. ఎగుమతి చేసే ఉల్లిపై కేంద్ర 40 శాతం సుంకాలు విధించింది.
ఎగుమతి చేసే ఉల్లి కనీస ధర టన్నుకు 800 అమెరికా డాలర్లు ఉండాలని నిబంధనలు విధించారు. ఉల్లి ధరలు పెరిగితే అదుపు చేసేందుకు కేంద్రం ఇప్పటికే 2.51 లక్షల టన్నుల సరకు నిల్వ చేసింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు