జమ్ము కశ్మీర్లో విషాదం
చోటుచేసుకుంది. శ్రీనగర్ ముజఫర్ నగర్ సమీపంలోని జీలం నదిలో పడవ బోల్తాపడింది.
దీంతో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు గాయపడ్డారు. వీరంతా గాంద్బల్ నుంచి బట్వారాకు వెళుతున్నట్లు
సమాచారం. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సమాచారం అందిన
వెంటనే విపత్తుల నిర్వహణ సంస్థ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు
చేపట్టారు.
క్షతగాత్రులను స్థానిక శ్రీమహారాజా
హరిసింగ్ ఆస్పత్రికి తరలించారు. పడవలో ఎక్కువ మంది స్కూలు విద్యార్థులు ఉన్నట్లు
తెలుస్తోంది.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో ప్రవాహం అధికంగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కొన్ని రోజులుగా జమ్ము-కశ్మీర్ లో భారీ
వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జలాశయాల్లో నీటి నిల్వలు పెరిగాయి. జమ్ము-శ్రీనగర్
జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని అధికారులు
మూసివేశారు.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు