దేశ
వ్యాప్తంగా ఎన్నికల సందడి కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు
జరుగుతున్నాయి. నాలుగో విడత ఎన్నికల్లో భాగంగా
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ,లోకసభ
ఎన్నికలు జరగనుండగా తెలంగాణలో లోక్‌సభ
ఎన్నికలు ఈ విడతలోనే నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 18 నుంచి నాలుగో విడత
ఎన్నికల నామినేషన్ల పర్వం
ప్రారంభంకానుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 18న ప్రారంభమై, మే 13న పోలింగ్ తో ముగియనుంది.
నామినేషన్ల
పర్వం ఏప్రిల్ 18న ప్రారంభం అవుతుండగా, నామినేషన్ల దాఖలుకు చివరితేదీ ఏప్రిల్
25గా ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన
జరగనుంది.
నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఏప్రి ల్ 29 కాగా పోలింగ్ మే 13న జరగనుంది. జూన్ 4న
ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి.
ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న నగదు, మద్యం, ఇతర గిఫ్ట్స్ భారీగా
పట్టుపడుతున్నాయి. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు దేశవ్యాప్తంగా 45 రోజుల
వ్యవధిలో రూ.4,650 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర తాయిలాలు, డ్రగ్స్ పట్టుబడ్డాయి. వీటిలో ఏకంగా
రూ.2,069 కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నాయని, ఇది మొత్తంలో 45 శాతం. 2019 ఎన్నికలతో తే ఈ దఫా పట్టుబడింది చాలా
ఎక్కువ మొత్తమేనని అధికారులు తెలిపారు.