బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా సమీపంలోని సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు జరిపిన దుండగులు, అక్కడ నుంచి గుజరాత్‌లోని భుజ్‌కు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి వారిని అదుపులోకి తీసుకుని ముంబై తరలించారు.
అనుమానితుల్లో ఒకరు ముంబైలోని హరిగ్రామ్లో నెల నుంచి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు గుర్తించారు.ఇళ్లు అద్దెకు ఇచ్చిన ఇంటి యజమాని నుంచి దుండగులు ఇటీవల మోటార్‌సైకిల్ కొనుగోలు చేసినట్లు విచారణలో తేలింది. సీసీ కెమెరాల్లో విజువల్స్ ఆధారంగా మోటార్ సైకిల్‌పై సల్మాన్ నివశించే అపార్టుమెంట్ ముందు దుంగడులు తిరగడాన్ని గుర్తించారు. ఆదివారం సల్మాన్ ఇంటి ముందు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి పారిపోయిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేసి, ఇప్పటికే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరికొంత మందిని విచారిస్తున్నారు.