ఇరాన్ అదుపులోకి తీసుకున్న వాణిజ్య నౌకలోని 18 మంది భారతీయ సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. అయితే ఇరాన్‌లోని రాయబార కార్యాలయ అధికారులు వారిని కలిసేందుకు మాత్రం అంగీకరించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ విజ్ఞప్తి మేరకు ఇరాన్ ప్రభుత్వం, భారత అధికారులను అనుమతించింది. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా అందులో 18 మంది భారతీయులు. వీరిలో ఓ భారతీయ మహిళ కూడా ఉన్నారు.
ఇజ్రాయెల్‌కు చెందిన ఎంఎస్సీ వాణిజ్య నౌకను హర్మూజ్ జలసంధిలో ఇరాన్ సైన్యం అదుపులోకి తీసుకుంది. వారిని విడిపించేందుకు భారత విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది. భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియాన్‌తో మాట్లాడారు. నౌకలోని సిబ్బందిని విడుదల చేయడానికి ఇరాన్ అంగీకరించింది. పాకిస్థాన్ ప్రధాని ఏప్రిల్ 22న ఇరాన్లో పర్యటించనున్న నేపథ్యంలో వారి సిబ్బందిని విడుదల చేసేందుకు అంగీకరించడం గమనార్హం.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు