Imran Khan, who raped four year old Hindu girl in Mumbai, arrested
మహ్మద్ ఇమ్రాన్ దరజ్ ఖాన్ అనే వ్యక్తి ముంబైలో నాలుగేళ్ళ
హిందూ బాలికను వేధించి, బెదిరించి, ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మీరారోడ్
ప్రాంతంలోని నవగఢ్ స్టేషన్ పోలీసులు ఆ మేరకు కేసు నమోదుచేసి, నిందితుణ్ణి అరెస్ట్
చేసారు. ఈ కేసు గురించి పోలీసులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిందితుడు ఇమ్రాన్‌ఖాన్ మీరారోడ్‌లో ఆరెంజ్ హాస్పిటల్
దగ్గర చికెన్ దుకాణం నడుపుతుంటాడు. బాధితురాలు అతని ఇంటి పక్కనే నివసిస్తుంది. నిందితుడు తరచుగా బాధిత బాలికకు చాక్లెట్లు,
బిస్కెట్లు ఇస్తుండేవాడు. అలాంటివి ఇవ్వవద్దని బాలిక తండ్రి చెప్పినా
పట్టించుకునేవాడు కాదు.
బాధిత బాలికపై నిందితుడు ఏప్రిల్ 7న అత్యాచారానికి
పాల్పడ్డాడు. కానీ ఆ విషయం ఏప్రిల్ 14న మాత్రమే వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక కడుపులో
నొప్పి వస్తోందని చెప్పడంతో అత్యాచారం సంగతి ఆదివారం నాడు బైటపడింది. తండ్రి అడిగినప్పుడు బాధిత బాలిక చికెన్ షాప్
యజమాని అయిన ఇమ్రాన్‌ఖాన్ తనపై అత్యాచారం చేసిన సంగతి చెప్పింది. ఆ సంగతి ఎవరికీ
చెప్పవద్దని బెదిరించాడని కూడా వెల్లడించింది.
బాలిక తండ్రి ఒక క్షురకుడు. అతని దుకాణం
నిందితుడి చికెన్ షాప్ దగ్గరే ఉంది. బాలిక తల్లి కొన్నిరోజుల క్రితం పుట్టింటికి
వెళ్ళింది. అప్పుడు తండ్రే బాలిక బాధ్యత చూసుకునేవాడు. తల్లి ఇంట్లో లేదన్న సంగతి
తెలుసుకున్న నిందితుడు బిస్కెట్లు, చాక్లెట్లు ఇచ్చి బాలికను మచ్చిక చేసుకున్నాడు.
ఏప్రిల్ 7న నిందితుడు బాలికను తన దుకాణానికి
తీసుకువెళ్ళాడు. అక్కడ ఆమెకు చాక్లెట్లు ఇచ్చాడు. కొద్దిసేపటికి ఆమెపై
బలాత్కారానికి పాల్పడ్డాడు. ఆ విషయం ఎవరికీ చెప్పవద్దని, చెబితే చంపేస్తాననీ పెద్ద
కత్తి చూపించి బెదిరించాడు. భయపడిన బాలిక నోరు మెదపలేదు. బాలిక ప్రవర్తనలో తేడాను
గమనించిన తండ్రి, ఒకట్రెండు సార్లు ఏం జరిగిందని అడిగినా ఆమె ఏమీ చెప్పలేదు. చివరికి నిన్న ఆదివారం కడుపునొప్పి రావడంతో
విషయం బైటపడింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు