ఢిల్లీ మద్యం విధానాన్ని కొందరికి అనుకూలంగా మార్చి మనీలాండరింగ్‌కు పాల్పడిన కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈడీకి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు, కేసు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
కేజ్రీవాల్ అరెస్ట్‌ను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. దీంతో కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించేందుకు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం నిరాకరించింది. ఈడీకి నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లో తమ అభిప్రాయం తెలియజేయాలని ఈడీని ఆదేశించింది. ఏప్రిల్ 29 తరవాత కేసు విచారణ చేపట్టనుంది.