దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్ 568 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 196 పాయింట్లు కోల్పోయి 22322 వద్ద ట్రేడవుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.44కు దిగజారింది.
సెన్సెక్స్ 30 ఇండెక్సులో టీసీఎస్, నెస్లే ఇండియా లాభాల్లో ట్రేడవుతున్నాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, పవర్ గ్రిడ్, విప్రో, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ షేర్లు నష్టాలతో మొదలయ్యాయి.
గత వారం అమెరికా మార్కెట్లు కూడా భారీ నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఉదయం ఆసియా మార్కెట్లు నష్టాలతో మొదలు కావడంతో దేశీయ స్టాక్ సూచీలు నష్టాలను మూటగట్టుకున్నాయి. ముడిచమురు ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. బ్యారెల్ ముడిచమురు ఇటీవల ఎన్నడూ లేని విధంగా 90.28 డాలర్లను దాటింది.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు