ఇరాన్ వద్ద బందీలుగా ఉన్న వాణిజ్య నౌక సిబ్బందిని కలిసేందుకు భారత అధికారులను అనుమతించాలని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇరాన్‌ను కోరారు. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణులతో భీకరదాడులకు దిగిన ఇరాన్, ఓ వాణిజ్య నౌకను అదుపులోకి తీసుకుంది.సరకుతో వస్తోన్న నౌక సిబ్బందిలో 17 మంది భారతీయులు ఉన్నారు. వారిని సురక్షితంగా విడుదల చేయాలని భారత్, ఇరాన్‌ను కోరింది.
బందీలుగా ఉన్న నౌకలోని భారతీయ సిబ్బందిని విడుదల చేయాలంటూ విదేశాంగ శాఖా మంత్రి ఎస్ జై శంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అమిర్ అబ్డోల్లాహెయిన్‌ను కోరారు. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం క్షేమకరం కాదని బందీలుగా ఉన్న సిబ్బందితో మాట్లాడేందుకు భారత రాయబార కార్యాలయ అధికారులను అనుమతించేందుకు ఇరాన్ సానుకూలంగా స్పందించింది. సాధ్యమైనంత త్వరగా పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని తాము భావిస్తున్నట్లు ఎస్.జైశంకర్ ఇరాన్ విదేశాంగ మంత్రికి స్పష్టం చేశారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు