మాల్దీవుల నుంచి భారత సైనికుల ఉపసంహరణ దాదాపు పూరైంది. రెండో దశ సైనికుల ఉపసంహరణ కూడా పూర్తి చేశారు. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు ఆ దేశ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భారత సైనికులను వెనక్కు పంపిస్తున్నారు. ఇదే విషయాన్ని ముయిజ్జు వెల్లడించారు. రెండో దశలో డోర్నియర్ విమాన నిర్వహణ చూస్తోన్న భారత సైనికులు ఏప్రిల్ 9న భారత్ తిరిగి వెళ్లిపోయారని మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు ప్రకటించారు.
మాల్దీవుల్లో 88 మంది భారత సైనికులు ఉండగా మొదటి దఫా మార్చి 11న 26 మందిని ఉపసంహరించుకున్నారు. వారి స్థానంలో 26 మంది పౌర సిబ్బందిని నియమించారు. రెండో దశలో ఎంత మందిని ఉపసంహరించుకున్నారనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. మే 10లోగా మిగిలిన కొద్ది మందిని కూడా భారత్ ఉపసంహరించుకోనుంది.
జగన్రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు