కోట్లాది మంది హిందువుల కల అయోధ్యలో రామాలయ నిర్మాణం సాకారం కావడంతో వారు మొక్కలు చెల్లించుకుంటున్నారు. ఈ నెల 17న శ్రీరామ నవమి ఉత్సవాల సందర్భంగా బాలరాముడిని సందర్శించుకునే భక్తుల కోసం దేవ్రహా బాబా ట్రస్టు లక్షా 11111 కేజీల లడ్డూను సిద్దం చేసింది.దేవ్రహా బాబా ట్రస్టు ఛైర్మన్ అతుల్ సక్సేనా ఈ విషయం మీడియాకు వెల్లడించారు. వారణాసి కాశీ విశ్వనాథ్, తిరుమల తిరుపతి దేవస్థానంకు ప్రతి వారం ప్రసాదం పంపుతున్నట్లు ఆయన చెప్పారు.
అయోధ్య బాలరాముని ఆలయ ప్రాణ ప్రతిష్ఠ సమయంలోనూ దేవ్రహా బాబా ట్రస్టు 40 వేల కిలోల ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేసింది. అనేక సేవా కార్యక్రమాలను కూడా దేవ్రహా బాబా ట్రస్టు నిర్వహిస్తోంది.