జార్ఖండ్ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్‌పై
బీజేపీ తీవ్ర విమర్శలు చేసింది. సీఎం చంపాయ్ సోరెన్ కీలుబొమ్మగా మారారని ఆరోపించిన
బీజేపీ సీనియర్ నేత అమర్ కుమార్ బౌరి, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య
కల్పన అధికార కేంద్రంగా మారారంటూ ఆరోపించారు.
జార్ఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా
ఉన్న బౌరి, ఏ హోదాలో కల్పనా సోరెన్
సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం చంపాయ్
సోరెన్ ఎందుకు నిస్సహాయుడిలా మారారో సమాధానం చెప్పాలన్నారు.
లోక్‌సభ ఎన్నికల
సమయంలో ఆయనకు ప్రాధాన్యం లేదని ఎద్దేవా చేశారు.
కల్పనా సోరెన్ రాజకీయ జోక్యం వారసత్వ
రాజకీయాలకు ఉదాహరణగా నిలుస్తోందన్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో సోనియా
గాంధీ పెత్తనం చెలాయించినట్లే కల్పనా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
జార్ఖండ్‌లో ‘ఇండీ’ కూటమి 14 సీట్లు గెలుచుకుంటుందన్న చంపాయ్ వ్యాఖ్యలపై
స్పందించిన బౌరి.. ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారన్నారు. జంషెడ్పుర్లో ఇండీ కూటమి కి అభ్యర్థే లేరన్నారు.
భూ కుంభకోణానికి సంబంధించిన
మనీలాండరింగ్ కేసులో జనవరిలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అరెస్టు
చేసింది. అప్పటి నుంచి ఆయయన సతీమణి కల్పన రాజకీయాల్లో క్రియాశీలంగా
వ్యవహరిస్తున్నారు.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్