ఇజ్రాయెల్
పై ఇరాన్ డ్రోన్లను ప్రయోగించడంతో పశ్చిమాసియాలో
ఉద్రిక్తత నెలకొంది. తాజా పరిణామాలపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భారతీయులు
అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
టెల్అవీవ్-టెహ్రాన్
మధ్య శత్రుత్వం ఆందోళనకరమన్న భారత విదేశాంగ శాఖ, స్థానిక అధికారులు జారీ చేసిన
భద్రతా ప్రొటోకాల్‌ను పాటించాలని తెలిపింది.
ఇజ్రాయెల్‌లోని
భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించి వివరాలను నమోదు
చేసుకోవాలని వెల్లడించింది.
ఇరుదేశాలు
సంయమనంతో శాంతి మార్గంలో సమస్యను పరిష్కరించుకోవాలని కోరింది. ఈ ప్రాంతంలో భద్రత, స్థిరత్వం
ఎంతో ముఖ్యమన్న భారత్, దౌత్య మార్గంలో ముందుకు సాగడమే మేలని హితవు చెప్పింది.
హర్మూజ్
జలసంధి సమీపంలో స్వాధీనం చేసుకున్న నౌకలోని 17 మంది భారతీయుల
విడుదల కోసం ఇరాన్ అధికారులతో భారత్ చర్చలు జరుపుతోంది.
ఇరాన్
చర్యపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించారు.
టెల్‌అవీవ్‌కు కవచంలా అండగా ఉంటామన్నారు. ఇరాన్ దుందుడుకు చర్యకు ప్రతి స్పందనకు
సంబంధించి చర్చించేందుకు జీ7 సభ్య దేశ నేతలతో భేటీ కానున్నట్లు బైడెన్ తెలిపారు.