దేశంలో బుల్లెట్ రైళ్ళ సర్వీసుల
విస్తరణకు సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వాగ్దానం చేశారు. అహ్మదాబాద్-ముంబై
బుల్లెట్ రైలు పనులు శరవేగంగా కొనసాగుతున్న విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని
మోదీ,
ఉత్తర, దక్షిణ, తూర్పు భారత్‌లకూ ఈ రైళ్ళ సేవలు
విస్తరిస్తామన్నారు.
‘సంకల్ప్ పత్ర’ పేరిట బీజేపీ ఎన్నికల
మేనిఫెస్టో విడుదల చేసిన అనంతరం ప్రధాని మోదీ ఈ హామీ గురించి వెల్లడించారు.
వందేభారత్
రైలు సర్వీసులను దేశంలోని ప్రతీ మూలకూ విస్తరిస్తామన్నారు. వందేభారత్ స్లీపర్, వందే భారత్ ఛైర్‌కార్, వందేభారత్ మెట్రో వంటి మూడు మోడళ్ళలో దేశంలో
ఇవి నడుస్తాయన్నారు.
వందేభారత్ సేవలు దేశంలో తొలిసారి
ఫిబ్రవరి 2019లో ప్రారంభం కాగా.. ఇప్పటివరకు 51 సర్వీసులు దేశవ్యాప్తంగా పరుగులు తీస్తున్నాయి.
ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు
ప్రాజెక్టును నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మిస్తోంది.
ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌కు రూ.10వేల కోట్లు అందజేస్తుండగా గుజరాత్, మహారాష్ట్రలు రూ.5వేల కోట్లు చొప్పున చెల్లించనున్నాయి.
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్