భారతదేశంలో 2 లక్షల మందికిపైగా ఎక్స్ ఖాతాదారుల అకౌంట్లను
‘ఎక్స్ కార్ప్’ బ్లాక్ చేసింది. చిన్నారులపై లైంగిక దాడులు, అశ్లీలత,
ఉద్రిక్తతలను
ప్రోత్సహించే కంటెంట్ కట్టడిలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
మార్చిలో ఏకంగా 2,12,627 ఖాతాలపై నిషేధం విధించినట్లు ప్రకటించింది.
భారతీయ సైబర్‌స్పేస్‌లో ఉగ్రవాద చర్యలను ప్రచారం చేసినందుకుగాను 1,235 ఖాతాలను బ్యాన్ చేసింది. కొత్త ఐటీ మార్గదర్శకాల
మేరకు చర్యలు చేపట్టినట్లు నెలవారీ నివేదికలో ఎక్స్ పేర్కొంది.
భారతీయ వినియోగదారుల నుంచి 5,158 ఫిర్యాదులు అందగా, తమ గ్రీవెన్స్ రెడ్రెసల్
మెకానిజం ద్వారా వాటిని పరిష్కరించామని తెలిపింది.
జనవరి 26 నుంచి ఫిబ్రవరి 25 వరకు ముగిసిన నెలలో 5,06,173 మంది ఖాతాలను ఎక్స్ నిషేధించింది.