సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే
లక్ష్యంగా బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది. పేదలు, యువత, రైతులు, మహిళల
అభివృద్ధే లక్ష్యంగా మేనిఫెస్టోను భారతీయ జనతా పార్టీ విడుదల చేసింది.
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్థికమంత్రి
నిర్మలా సీతారామన్,
బీజేపీ
జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దిల్లీలోని బీజేపీ
ప్రధాన కార్యాలయం వేదికగా మేనిఫెస్టో ఆవిష్కరణ జరిగింది.
రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని 27 మంది
సభ్యుల బృందం, 14 అంశాలతో సంకల్ప్ పత్రం పేరిట ఈ మేనిఫెస్టోను రూపొందించింది.
మేనిఫెస్టో
విడుదల సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ, దేశాభివృద్ధి కోసం ఎన్నో నిర్ణయాలు
తీసుకున్నామన్నారు. బీజేపీ సంకల్ప పత్రం యువత ఆకాంక్షను ప్రతిబింబిస్తుందన్నారు. 70 ఏళ్ళు పైబడిన వారికి ఉచిత వైద్యం అందించడంతో పాటు పేదల
జీవితాలు మార్చడమే మోదీ ఇచ్చే గ్యారెంటీ అన్నారు. మోదీ గ్యారెంటీ అంటే వందశాతం
నెరవేర్చడమే అన్నారు.
ముద్ర రుణాల పరిమితి రూ.20 లక్షలకు పెంచడంతో పాటు వ్యవసాయంలో టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నట్లు
మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
మూడు కోట్ల ఇళ్ళ నిర్మాణంతో పాటు మరో ఐదేళ్ళు ఉచిత
రేషన్ అందజేస్తామన్నారు. పైప్ లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ సరఫరా , దివ్యాంగుల
ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా నివాసాలు నిర్మిస్తామని బీజేపీ వాగ్దానం చేసింది.
ట్రాన్స్జెండర్లకు సైతం ఆయుష్మాన్ భారత్
సదుపాయం కల్పిస్తామని, మూడు కోట్ల మంది మహిళలను లక్షాధికారులుగా మార్చే ప్రణాళిక
రూపొందిస్తామని మేనిఫెస్టోలో బీజేపీ పేర్కొంది.
బీజేపీ
మేనిఫెస్టోలోని కొన్ని హామీలు
కూరగాయల
సాగు, నిల్వ కోసం కొత్త క్లస్టర్లు
మహిళా
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
మత్స్య
ఉత్పత్తి, ప్రాసెసింగ్
కోసం ప్రత్యేక క్లస్టర్లు
ప్రకృతి
వ్యవసాయానికి ప్రాధాన్యం
శ్రీఅన్న
సాగుకు ప్రోత్సాహం
ప్రపంచవ్యాప్తంగా
తిరువళ్లువర్ సాంస్కృతిక కేంద్రాల ఏర్పాటు
తమిళ
భాష ఖ్యాతిని విశ్వవ్యాప్తం
చేసేందుకు కృషి
ఉపాధి
అవకాశాలు పెంచే కొత్త శాటిలైట్ పట్టణాల ఏర్పాటు
విమానయాన
రంగానికి ఊతం
వందేభారత్
విస్తరణ
దేశ
ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోనూ బుల్లెట్ రైలు
విదేశాల్లోని
భారతీయుల భద్రతకు హామీ
కేంద్రానికి లొంగాల్సిన అవసరం మాకు లేదు : సీఎం స్టాలిన్