బాలీవుడ్ నటుడు సల్మాన్ ఇంటి వద్ద కాల్పులు చోటు చేసుకున్నాయి. గుర్తుతెలియని ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో బాలీవుడ్లో కలకలం రేగింది. ముంబైలో సల్మాన్ నివాసం ఉండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ అపార్టుమెంట్ ముందు ఈ కాల్పుల ఘటన ఆదివారం తెల్లవారుజామున 5 గంటలకు జరిగినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.
2023 మార్చిలో సల్మాన్‌ఖాన్‌ను బెదిరిస్తూ ఆయన కార్యాలయానికి ఈమెయిల్ వచ్చిన విషయం తెలిసిందే. సల్మాన్ కార్యాలయ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి, గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్టోయ్, గోల్డీ బ్రార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గ్యాంగ్స్టర్ల హిట్ లిస్టులో సల్మాన్ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గతంలో రాజస్థాన్‌లో సల్మాన్ కృష్ణజింకను వేటాడిన కేసు తరవాత, బిష్ణోయ్‌ల మనోభావాలను దెబ్బతీశారంటూ ఆ సామాజిక వర్గానికి చెందిన లారెన్స్ బిష్ణోయ్ వ్యాఖ్యానించారు. బెదిరింపు మెయిల్స్‌లో ఇదే విషయం స్పష్టమైంది. బెదిరింపుల తరవాత సల్మాన్‌కు భద్రత కూడా పెంచారు. ప్రస్తుతం ఆయనకు వై ప్లస్ భద్రత ఉంది.