ఉగ్రవాదులకు నియమ, నిబంధనలు ఉండవు, వారికి సమాధానం కూడా అలాగే ఉంటుందని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ మహారాష్ట్రలోని పుణెలో స్పష్టం చేశారు. గడచిన పదేళ్లలో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేశామని చెప్పుకొచ్చారు. ఉగ్రవాదాన్ని మార్పు ద్వారా ఎదుర్కోవడం సరైన విధానమన్నారు. ఉగ్రవాదులు దాడులకు తెగబడితే సమాధానం కూడా అలాగే ఉంటుందని హెచ్చరించారు.
దేశానికి ఉగ్రవాదుల ముఫ్పు, దౌత్య సంబంధాలపై కేంద్ర మంత్రి జైశంకర్ పుణెలో యువత అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. పాకిస్థాన్‌తో సంబంధాలు కొనసాగించడం కష్టంగా ఉందంటూ ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలోనూ ఆమోదించేది లేదని తేల్చి చెప్పారు.
ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ స్వప్రయోజనాలకు ఉపయోగిస్తోందని జైశంకర్ అభిప్రాయపడ్డారు. గడచిన పదేళ్లలో విదేశాంగ విధానంలో 50 శాతం మార్పు వచ్చిందన్నారు.ముంబై దాడుల తరవాత భారత్, పాక్‌పై దాడి చేయకపోవడం వల్ల తరవాత కాలంలో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.