అమెరికాలో ఇటీవల హిందూ వ్యతిరేక శక్తులు రెచ్చిపోతున్నాయి. హిందూ మతంపై ఫోబియా, ద్వేషం, అసహనాలను ఖండిస్తూ భారతీయ అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు ఒకరు సభలో తీర్మానం ప్రవేశ పెట్టారు. శ్రీ ధనేదార్ అనే సభ్యుడు ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ద్వారా పర్యవేక్షణ, జవాబుదారీతనంపై హౌస్ కమిటీకి సిఫార్సు చేశారు.
అమెరికా అభివృద్ధిలో హిందువులు కీలకంగా, నమ్మకంగా వ్యవహరిస్తున్నారు. వారి వారసత్వం, చిహ్నాలపై కొందరు కావాలనే అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఇక పాఠశాలలు, కాలేజీల్లో వేధింపులు తప్పడం లేదు. వివక్షను ఎదుర్కోవాల్సి వస్తోందని తీర్మానంలో పేర్కొన్నారు.కొందరు కావాలనే హిందూమతంపై విధ్వేషపూరిత ప్రసంగాలు చేయడం ద్వారా నేరాలు పెరుగుతున్నాయన్నారు. వివక్షతో దాడులు జరుగుతున్నాయన్నారు.గడచిన 124 సంవత్సరాల్లో అమెరికా 40 లక్షల మంది హిందువులను తమ దేశంలోకి అనుమతించిందని, వారి సహకారం మరవలేనిదని కూడా తీర్మానంలో గుర్తుచేశారు.