పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఏ క్షణమైనా డోన్లు, రాకెట్లతో విరుచుకుపడవచ్చనే అమెరికా హెచ్చరికలతో భారత్ తమ పౌరులకు అలర్ట్ జారీ చేసింది. గత వారం ఇజ్రాయెల్ సైన్యం సిరియాలోని రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన కీలక కమాండర్‌ను మట్టుబెట్టింది. అప్పటి నుంచి ఇరాన్ రగిలిపోతోంది. ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులకు సిద్దం అవుతోందనే వార్తలు నేపథ్యంలో ఆయా దేశాలు వారి పౌరులను సొంత దేశాలకు తరలిస్తున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు కూడా ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు.
ఇప్పటికే ఇజ్రాయెల్ దేశంలో 22 వేల మంది భారతీయ విద్యార్థులు, కొందరు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అక్కడ నిర్మాణ రంగంలో పని చేసేందుకు ఇటీవల కొందరిని ఇజ్రాయెల్ పంపించారు. అయితే కొత్తగా ఇజ్రాయెల్ ఎవరూ వెళ్ల వద్దని భారత విదేశాంగ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఇజ్రాయెల్ వెళ్లడానికి సిద్దమైన వారు కూడా తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది.
మరోవైపు ఇరాన్ వెళ్లే పౌరులను కూడా భారత్ హెచ్చరించింది. యుద్దం అంటూ మొదలైతే ఇరుదేశాలు క్షిపణులతో విరుచుకుపడే ప్రమాదముంది. ఇప్పటికే ప్రయాణాలకు సిద్దమైన వారు కూడా ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లడం వాయిదా వేసుకోవాలని భారత విదేశాంగ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు