సర్వోదయ ఉద్యమ నేత మురారి లాల్ రుషికేశ్‌లో చికిత్స పొందుతూ శుక్రవారంనాడు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ రుషికేశ్‌లోని ఎయిమ్స్‌లో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. చిప్కో ఉద్యమ మాతృసంస్థ దశోలీ గ్రామ స్వరాజ్య మండల్‌కు మురారి లాల్ అధ్యక్షుడు.
బంజరు భూములను సస్యశ్యామలం చేయడంలో మురారి లాల్ కీలక పాత్ర పోషించారు. బంజరు భూముల వినియోగానికి ఆయన వినూత్న విధానాలను కొనుగొన్నారు. వాటిని ఆచరించి రైతుల ఆదాయం పెంచారు. సహజ వనరులను సంరక్షించుకుంటూ ఆయన సాగించిన ఉద్యమం 80వ దశకంలో బాగా ప్రాచుర్యం పొందింది. లాల్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు సమన్లు