అంతరిక్షంలో అడుగు పెట్టిన తొలి భారతీయుడుగా రాకేశ్ శర్మ గురించి అందరికీ తెలిసిందే. ఆ తరవాత భారతీయ అమెరికన్లు కల్పనా చావ్లా, సునితా విలియమ్స్, రాజా చారి, బండ్ల శిరీష కూడా అంతరిక్షంలో అడుగు పెట్టి చరిత్ర సృష్టించారు. ఇంత వరకు తెలుగు వారు ఎవరూ అంతరిక్షంలో అడుగు పెట్టింది లేదు. అయితే ఆ అవకాశం తోటకూర గోపీచంద్ అనే యువకుడికి వచ్చింది. అయితే న్యూ షెపర్డ్ ప్రాజెక్టులో భాగంగా పర్యాటకుడిగా ఆయన అంతరిక్షంలోకి వెళ్లనున్నారు.
అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ బ్లూ ఆరిజన్. న్యూ షెపర్డ్ మిషన్ పేరుతో పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళుతున్నారు. 2021 నుంచి ఇప్పటి వరకు 31 మందిని మాత్రమే అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. తాజాగా చేపట్టబోయే యాత్రకు ఆరుగురిని ఎంపిక చేశారు. వారిలో తోటకూర గోపీచంద్‌కు అవకాశం దక్కింది.
విజయవాడకు చెందిన గోపీచంద్ అట్లాంటాలో ఫిట్నెస్ కేంద్రం నడుపుతున్నాడు. అంతరిక్ష పర్యాటక సంస్థ బ్లూ ఆరిజన్ అధికారికంగా ప్రకటించే వరకు తనకు కూడా తెలియదని గోపీచంద్ చెప్పారు. చిన్నప్పటి నుంచి అంతరిక్షంపై ఆసక్తి ఉండటంతో ఏరోనాటికల్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు.
జగన్‌రెడ్డి ఏపీ పరువు తీశాడు : షర్మిల…ప్రభాస్ ఎవరో నాకు తెలియదు