దేశమంతటా
భానుడు ప్రతాపం చూపుతుంటే తమిళనాడులో మాత్రం వరుణుడు కరుణించాడు. అధికవేడి,
ఉక్కపోత నుంచి తమిళనాడు ప్రజలకు తాత్కాలిక ఉపశమనం లభించింది. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో నేడు చిరుజల్లులు
కురుస్తున్నాయి. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి.
మరో 48
గంటలపాటు తమిళనాడులో వాతావరణం చల్లగానే ఉండే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం
తెలిపింది. తమిళనాడు రాజధాని చెన్నైలో కూడా రెండురోజులపాటు ఆకాశం మేఘావృతమై
ఉంటుందని, పగటి ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల లోపే
ఉంటాయని అంచనా వేసింది.
వాన
కారణంగా తూత్తికూడిలో పలు చోట్ల రోడ్లపై వరద నిలిచింది. దీంతో రాకపోకలకు అంతరాయం
ఏర్పడింది.
గత 24 గంటల వ్యవధిలో 2.9 మిల్లీ మీటర్ల వర్షం నమోదైనట్లు వాతావరణ శాఖ
అధికారులు తెలిపారు. గత వారంలో 13.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
తిరుపత్తూరులో 41.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు
కాగా, సేలంలో 40.1 డిగ్రీలు నమోదు కాగా తమిళనాడులోని తీరప్రాంతంలోని 33 నుంచి 37
డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డుఅయ్యాయి. కొండప్రాంతాల్లో 21 నుంచి 31 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.