చిత్ర నటుడు సాయాజీ షిండే గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. మహారాష్ట్రలోని సతారాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. గురువారం గుండెనొప్పి రావడంతో ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు యాంజియోప్లాస్టీ చేయడంతో ప్రాణాపాయం తప్పింది.
కొంత కాలంగా షిండే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. గుండెలో నొప్పి రావడంతో యాంజియోగ్రఫీ చేశారు. గుండె కుడిభాగంలో 99 శాతం రంధ్రాలు గుర్తించారు. వెంటనే యాంజియోప్లాస్టీ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. సాయాజీ షిండే ఆరోగ్యం మెరుగుపడుతోందని డాక్టర్లు వెల్లడించారు.త్వరలో ఆయన్ని డిశ్ఛార్జ్ చేయనున్నారు. అనేక విజయవంతమైన చిత్రాల్లో షిండే నటించారు.