ఎన్సీఈఆర్టీ,
ఎస్సీఈఆర్టీ ఆమోదించిన పాఠ్యపుస్తకాలు, మెటీరియల్ను మాత్రమే దేశవ్యాప్తంగా
ఉన్న పాఠశాలల్లో ఉపయోగించాలని రాష్ర్టాలకు
నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ చైల్డ్ రైట్స్ ( NCPCR) లేఖ రాసింది. స్కూల్లో నోటీస్
బోర్డులు, వెబ్సైట్స్ ద్వారా ఈ విషయాన్ని
విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాని పేర్కొంది. పాఠశాల విద్యశాఖ కార్యదర్శలకు
ఈ మేరకు లేఖ రాశారు.
విద్యా
హక్కు చట్టం (RET) పరిధిలోకి వచ్చే అన్ని పాఠశాలల్లో
సిలబస్, పాఠ్యపుస్తకాలు, మూల్యాంకన పద్ధతుల్లో ఏకరూపత అవసరమని వివరించింది.
కొన్ని
స్కూళ్ళ యాజమాన్యాలు ప్రైవేటు పబ్లిషర్ల నుంచి పుస్తకాలు కొనుగోలు చేయాలని విద్యార్థులను
బలవంతం చేయడంపై ఎన్సీపీసీఆర్కు ఫిర్యాదులు అందాయి. దీంతో ఎన్సీపీసీఆర్ తాజా
ఆదేశాలు జారీ చేసింది.